
పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించిన బాధితులు
నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: ట్రాక్టర్ విషయంలో జరిగిన గొడవ కేసులో ఇరువర్గాలు బంధువులు కావడంతో స్థానిక ఎమ్మెల్యే బంధువుతోపాటు మరికొంత మందితో పంచాయితీ చేయడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నంద్యాల మండలం అయ్యలూరులో నవంబరు 15న అబ్దుల్ రషీద్‌తోపాటు మరో ఐదుగురు కలిసి పొలంలో ట్రాక్టర్‌తో సేద్యం చేస్తున్న మహబూబ్బాషపై దాడి చేసి ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. దాంతో బాధితుడు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్‌ను తీసుకెళ్లిన వ్యక్తులు కూడా బంధువులు కావడంతో ఇరువురిని పిలిపించిన పోలీసులు స్థానిక ఎమ్మెల్యే బంధువు ఆదినారాయణరెడ్డితోపాటు మరికొంత మందితో డీఎస్పీ వద్ద రాజీ చేయాలని యత్నించారు. ఎమ్మెల్యే బంధువు రావడంతో ట్రాక్టర్ యజమాని రియాజ్ మరింత రెచ్చిపోయి ట్రాక్టర్ ఇవ్వండి.. లేదంటే నిప్పంటిస్తామని పోలీసుల ఎదుటే పెట్రోలు పోశారు. ఆదినారాయణరెడ్డి జోక్యం చేసుకోవడంతో నిప్పంటించకుండా పోలీస్‌స్టేషన్ ఎదుట రహదారిలో బాధితులు బైఠాయించారు. ఈ విషయమై సీఐ దివాకర్‌రెడ్డిని వివరణ కోరగా.. ట్రాక్టర్‌ను రికవరీ చేశాం. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.