Published : 03/12/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి

- యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప


మాట్లాడుతున్న యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప పిలుపునిచ్చారు. బుధవారం జరిగిన యూటీఎఫ్‌ జిల్లా స్థాయి సర్వ సభ్య సమావేశంలో ఎల్లప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులపై సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 1553 ఎస్‌జీటీ పోస్టుల్లో 494 పోస్టులు బ్లాక్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మండల విద్యాధికారులకు అవగాహన లేక ఇలా జరిగిందన్నారు. 60 నుంచి 70 మంది విద్యార్థులు ఉన్న చోట ఒక పోస్టు చూపించి మిగిలిన పోస్టులను తొలగించడం దారుణమన్నారు. చాలా పాఠశాలల్లో పది మంది విద్యార్థులున్నచోట ఇద్దరు ఉపాధ్యాయులను ఉంచారని గుర్తు చేశారు. బదిలీల విషయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. డీఎస్సీ 2018లో ఎంపికైన ఉపాధ్యాయులకు ట్రెజరీ ఐడీ నెంబర్లు తెప్పించడానికి అధికారులు ఒక్కొక్కరితో రూ.1000 నుంచి రూ. 2వేలు అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. పైసలు ఇవ్వందే ట్రెజరీలో ఏ పనులు కావడం లేదన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్‌ నాయకులు నాగమణి, నాగరాజు, రాఘవేంద్ర పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని