Published : 03/12/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉసురు తీస్తున్నా.. వ్యర్థమే ఆహారం

న్యూస్‌టుడే, మంత్రాలయం: ఆవును గోమాతగా పూజించడం సంప్రదాయం. అలాంటి గోవులు తమ ఆకలి తీర్చుకునేందుకు ఆపదను ఆరగిస్తున్న దీనమైన పరిస్థితి ఇది. మంత్రాలయంలో జనసమ్మర్ధం పెరిగి ఆవుల సంచారానికి అడ్డంకిగా మారింది. దీంతో చెత్త కుండీల వద్ద దొరికిన వ్యర్థాలతో ఆకలిని తీర్చుకుంటున్నాయి. అందులో అనేక ప్లాస్టిక్‌ వ్యర్థాలు కలిసి వాటి ఆహారంతో కలిసి మరణానికి కారణమవుతున్నాయి. ఇటీవల కౌతాళం మండలంలో ఓ రైతుకు చెందిన ఆవు ప్లాస్టిక్‌ వ్యర్థాలు తిని మరణించిన ఘటన చోటు చేసుకుంది. ఇలా అనేక చోట్ల గోవులు ఆకలితో ఆపద బారిన పడుతున్నాయి.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని