Published : 03/12/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆకస్మికంగా ఆరోగ్యశ్రీ ఆసుపత్రి తనిఖీ

అగ్రసేని ఆసుపత్రిలో వైద్యసేవలపై రోగిని ఆరా తీస్తున్న కలెక్టర్‌ వీరపాండియన్‌

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు. బుధవారం స్థానిక సప్తగిరి కాలనీలోని అగ్రసేని ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టరు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీసి పారిశుద్ధ్యం, భోజనం, తదితర సదుపాయాలపై అడిగి తెలుసుకొన్నారు. చికిత్స తర్వాత రోగికి అందాల్సిన సాయాన్ని సరైన సమయంలో బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చూడాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సుమన్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. వ్యాధుల చికిత్సలు ఆసుపత్రిలో లేకపోతే ఏ ఆసుపత్రిలో లభిస్తుందో అక్కడికే పంపాలని ఆసుపత్రి నిర్వాహకుడు పవన్‌కుమార్‌ సింగ్‌కు సూచించారు. అంతకు ముందు ఆరోగ్యశ్రీ హెల్ప్‌డెస్కు పరిశీలించారు.

అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడి రైతులకు ఆర్థికాభివృద్ధి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ది చెందుతారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రతి పాడి రైతు లీటరుకు కనీసం రూ.4 అదనపు ఆదాయం అందుకోవాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. మహిళా పాల ఉత్పత్తి సంఘాలకు జీవం పోసేందుకు డెయిరీ రంగంలో పేరు మోసిన అమూల్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఒప్పందం మేరకు అమూల్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా లాంఛనంగా ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి ప్రారంభించారు. ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల మహిళా పాడి రైతులతో సీఎం సంభాషించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ జీ.వీరపాండియన్‌, జేసీలు రాంసుందర్‌ రెడ్డి, ఖాజ మొహిద్దీన్‌, పశు సంవర్దక శాఖ జేడీ డా.పి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని