Published : 03/12/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిల్లా కారాగారానికి నంద్యాల సీఐ, కానిస్టేబుల్‌

రక్తపరీక్ష చేయించుకుని బయటకు వస్తున్న సీఐ

సోమశేఖర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: అబ్దుల్‌ సలాం కుటుంబ ఆత్మహత్య కేసులో నిందితులైన నంద్యాల సీఐ సోమశేఖర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌లకు అదనపు జిల్లా కోర్టు బెయిల్‌ రద్దు చేసిన నేపథ్యంలో వీరిని నంద్యాల రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ సీఐ కంబగిరిరాముడు బుధవారం సాయంత్రం కర్నూలుకు తీసుకువచ్చారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వీరికి కరోనాతోపాటు ఇతర ఆరోగ్య పరీక్షలు చేయించారు. ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారణ చేశారు. అనంతరం రాత్రి వీరిని కర్నూలు మండలం పంచలింగాల పరిధిలోని జిల్లా కారాగారానికి తరలించారు. ఆసుపత్రిలో సీఐ, హెడ్‌కానిస్టేబుళ్లు మీడియా కంటపడకుండా చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.

ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సాయం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల దేవస్థానంలో ఒప్పంద ఉద్యోగి కె.వి.డి.నగేష్‌కుమార్‌ జులై నెలలో అనారోగ్యంతో మృతి చెందారు. బాధిత కుటుంబానికి సహాయార్థం దేవస్థానంలో పనిచేసే ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది తమ ఒక్క రోజు వేతనం రూ.1,83,092లను సేకరించారు. నగేష్‌కుమార్‌ సతీమణి గౌతమీబాలకు దేవస్థానం ఈవో కె.ఎస్‌.రామారావు చెక్కును బుధవారం అందజేశారు. కార్యక్రమంలో ఒప్పంద ఉద్యోగుల యూనియన్‌ అధ్యక్షుడు బాలునాయక్‌, శ్రీను, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని