Published : 05/12/2020 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

దస్త్రాలను పరిశీలిస్తున్న డీపీవో నూర్జహాన్‌ 

నందవరం, న్యూస్‌టుడే: గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని డివిజినల్‌ పంచాయతీ అధికారి నూర్జహాన్‌ తెలిపారు. నందవరం గ్రామంలో పర్యటించి శానిటైజేషన్‌ పనులను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని,  త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ ఈశ్వరయ్య, పంచాయతీ కార్యదర్శి జయరాం, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని