
బకాయి బిల్లుల వసూళ్లలో వేగం పెంచండి
మాట్లాడుతున్న విద్యుత్తుశాఖ ఎస్ఈ శివప్రసాద్‌రెడ్డి
కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: విద్యుత్తుశాఖకు బకాయి పడ్డ ప్రభుత్వ కార్యాలయాల బిల్లుల వసూళ్లలో 40 శాతం బకాయిలను వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్తుశాఖ ఎస్ఈ శివప్రసాద్‌రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక విద్యుత్తుభవన్లో అన్ని డివిజన్ల డీఈలతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ జిల్లా పరిధిలో వినియోగదారులకు నిరంతర విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నెలవారి విద్యుత్తు బిల్లులను వందశాతం వసూలు చేయాలని ఆదేశించారు. కొత్తగా కనెక్షÛన్ల కోసం దరఖాస్తు చేసుకొన్న వారికి వెంటనే కనెక్షన్ మంజూరయ్యేలా చూడాలన్నారు. అన్ని డివిజన్ల డీఈలు ప్రదీప్‌కుమార్, జగన్మోహన్రెడ్డి, నాగరాజు, ఉమాపతి, సుధాకర్, డీఈటి నాగప్ప పాల్గొన్నారు.
Tags :