
అక్రమ లేఅవుట్లను ఈనెలాఖరులోగా క్రమబద్ధీకరించుకోవాలి
కుడా సమావేశంలో మాట్లాడుతున్న డీపీవో ప్రభాకరరావు
కర్నూలు నగరం (జడ్పీ), న్యూస్టుడే: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ లేఅవుట్లలో గృహాలు నిర్మించుకున్న వినియోగదారులు ఈనెలాఖరులోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని క్రమబద్ధీకరించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్ కోరారు. కర్నూలు పట్టణాభివృద్ది సంస్థ (కుడా) జిల్లా స్థాయి సమావేశం శుక్రవారం కర్నూలు కార్యాలయంలో జరిగింది. కుడా ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, కుడా పరిధిలోని 35 మంది ఈవోఆర్డీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లపై కుడా పరిధిలోని ఈవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు విస్తృత ప్రచారంతోపాటు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఏఏ మండలాల్లో ఎన్ని అనధికార నిర్మాణాలున్నాయనే అంశాలపై వివరాలు సేకరించి నోటీసులు జారీ చేయాలని ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి కోరారు. ఈనెలాఖరులోగా క్రమబద్ధీకరించుకునే వారికి అన్ని వసతులు కల్పిస్తామన్నారు.