Published : 05/12/2020 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్టీసీకి నిరాశ

పుష్కరాలకు తగ్గిన ఆదాయం

కర్నూలు నగరం(ఆర్టీసీ), న్యూస్‌టుడే: తుంగభద్ర పుష్కరాలకు భారీ సంఖ్యలో వచ్చే ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడి.. ఖజానాకు కాసులు వస్తాయనుకుంటే ఆర్టీసీకి నిరాశే మిగిలింది. కరోనా నేపథ్యంలో నదీ స్నానాలను నిషేధించడంతోపాటు భక్తులు అధిక శాతం సొంత వాహనాల్లో ఘాట్‌లకు చేరుకోవడంతో బస్సులకు రద్ధీ లేకుండాపోయింది. 12 రోజులపాటు 286 ప్రత్యేక బస్సులు 71 వేల కి.మీ. ప్రయాణించి 63,839 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. తద్వారా రూ.18.60 లక్షల రాబడే రావడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. 2008లో జరిగిన తుంగ పుష్కరాలకు 1487 బస్సుల ద్వారా 5.68 లక్షల కి.మీ. నడిపిన ఆర్టీసీ రూ.1.28 కోట్ల రాబడి సాధించింది.

రూ.13.35 లక్షల నష్టం..

పుష్కరాల్లో భక్తులకు ఎంత పుణ్యమోగాని.. కర్నూలు ఆర్టీసీ రీజియన్‌కు మరో రూ.13.35 లక్షల నష్టం వాటిల్లింది. బస్సు ఒక కి.మీ. ప్రయాణిస్తే రూ.45 రావాల్సి ఉంది. కానీ పుష్కరాలకు తిరిగిన బస్సులకు కి.మీ.కు రూ.26.20 రావడంతో కి.మీ.కు రూ.19.80 నష్టం వాటిల్లింది. ఆర్టీసీ మరో నష్టం భరించాల్సి వచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని