Published : 05/12/2020 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భూములు రక్షించాలని జలదీక్ష

- ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఉద్యోగుల వినూత్న నిరసన  

కాలువలో దిగి నిరసన తెలుపుతున్న ఉద్యోగులు 

నంద్యాల, న్యూస్‌టుడే: నంద్యాలకు చెందిన ప్రజాప్రతినిధులు రైతుల పేరుతో ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగి ఇప్పుడు రైతులకు ఉపయోగపడే పరిశోధన కేంద్రం వ్యవసాయ భూములనే నిర్వీర్యం చేస్తున్నారని నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఉద్యోగులు నిరసన చేపట్టారు. శుక్రవారం వారు పరిశోధన కేంద్రంలోని పంట కాల్వలో జల దీక్ష చేశారు. ఉద్యోగ, కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, సీఐటీóŸ΄ అధ్యక్షుడు డి.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంత ఎంపీ శాస్త్రవేత్తగా పని చేసి ప్రజాప్రతినిధిగా ఎదిగిన తర్వాత పరిశోధన కేంద్రాన్ని తరలించాలని చూడటం భావ్యం కాదన్నారు. తన భూములకు లాభం కోసం వైద్య కళాశాలకు ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములను కేటాయించాలని కుట్ర పన్నుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశోధన కేంద్రం ఉంటే ఎదురుగా ఉన్న తన భూములకు ధరలు రావని వైద్య కళాశాల నిర్మాణానికి పచ్చజెండా ఊపడం మంచిది కాదన్నారు. ఈ నిరసనలో 300 మంది వివిధ కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని