Published : 22/01/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిప్పంటించుకున్న చేనేత కార్మికుడి మృతి

చికిత్స పొందుతున్నప్పటి చిత్రం

ఎమ్మిగనూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో ఇంటి స్థలం విషయంలో అన్యాయం జరిగిందని జనవరి 16న పెట్రోల్‌ పోసుకొని నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన చేనేత కార్మికుడు శంకరన్న(52) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు మృతుడు దాదాపు 24ఏళ్ల కిందట పట్టణంలో రెండు సెంట్లు స్థలం కొన్నారు. అమ్మినవారు వారు డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్‌ చేయించారు. మృతుడికి అమ్మిన స్థలంలో రస్తా ఉందని తేలింది. తనకు జరిగిన అన్యాయంపై పెద్దలతో పంచాయతీ పెట్టి చివరికి న్యాయస్థానానికి వెళ్లారు. న్యాయస్థానంలో తనకు అనుకూలంగా తీర్పు రాలేదని మనస్తాపం చెంది పెట్రోలు పోసుకొని పట్టణ నడిబొడ్డున ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి అందరికీ విదితమే. తీవ్రంగా గాయపడిన బాధితుడు కర్నూలులో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని