Published : 22/01/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నకిలీ పత్రాల తయారీదారుల అరెస్టు

మరి కొందరి పాత్రపై పోలీసుల ఆరా

వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీరాములు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో నిందితుల బెయిల్‌కు అవసరమైన జామీనుదారుల నకిలీ పత్రాలు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టుకు మోసం చేయడం, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో వారిపై కేసులు నమోదు చేశారు. సీఐ శ్రీరాములు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన ఉరుకుందు నకిలీ జామీను పత్రాలు తయారు చేస్తున్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని కపటి గ్రామ కార్యదర్శి విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 20వతేదీన కేసు నమోదు చేసి విచారించారు. ఉరుకుందను అరెస్టు చేసి వివరాలు ఆరా తీయగా నకిలీ జామీనుదారుల పత్రాలు, నకిలీ ఇంటి విలువ ధ్రువీకరణ పత్రాలు, నకిలీ ఇంటి పన్ను పత్రాలు, అధికారుల ఫోర్జరీ సంతకాలు, నకిలీ సీళ్లు తయారు చేశాడని తేలిందని సీఐ తెలిపారు. దీంతో ఉరుకుందుతో పాటు నకిలీ పత్రాల రసీదు పుస్తకాలు ప్రింటింగ్‌ చేస్తున్న ఆదోనికి చెందిన రాయలసీమ ప్రింటర్స్‌ యజమాని జగదీష్‌ను అరెస్టు చేశామన్నారు. వారిద్దరి నుంచి నకిలీ పత్రాలు, నకిలీ రసీదు పుస్తకాలు, నలుగురు అధికారుల సీల్లు, కంప్యూటర్, ప్రింటింగ్‌ యంత్రంలో వినియోగించే అక్షరాల షీటు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక్కో నకిలీ పత్రం జారీ కోసం రూ.4500 నుంచి రూ.5వేలు వరకు వసూళ్లు చేస్తున్నాడని, ఐదుగురు న్యాయవాదులకు ఇవి అందించాడని తెలిపారు. న్యాయవాదుల పాత్ర ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో నిందితులు ఈ పత్రాలు సరఫరా చేసినట్లు చెబుతున్న నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. 


నకిలీ ధ్రువీకరణ పత్రం  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని