
మాసోత్సవాల సందర్భంగా ఉచిత వైద్యశిబిరం
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: నంద్యాల మండలంలోని చాపిరేవుల టోల్‌ప్లాజా మేనేజర్ రవిరాజన్ ఆధ్వర్యంలో గురువారం జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాల సందర్భంగా వైద్యశిబిరం నిర్వహించారు. చోదకులకు, టోల్‌ప్లాజా సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో శాంతిరాం ఆసుపత్రి వైద్యులు రవిచంద్ర, గౌతమ్, భద్రతా మేనేజరు ఖాదర్‌వలీ, హెఆర్ మేనేజరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Tags :