
అపోహలు మాని టీకాలు వేయించుకోండి
కొవిడ్ టీకా వేయించుకుంటున్న ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: అపోహలు వీడి ప్రతిఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని కర్నూలు పెద్దాస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సర్వజన వైద్యశాలలోని ఓల్డ్ గైనిక్ విభాగంలో గురువారం ఆయన టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వజన వైద్యశాలలో చాలామంది వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పలు అనుమానాలతో ముందుకు రావడం లేదని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో చాలామంది వైద్యులు టీకాలు వేయించుకున్నారని చెప్పారు. ఉప పర్యవేక్షకులు డాక్టర్ భగవాన్, డాక్టర్ సునీల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags :