
మార్చి నుంచి విమాన సేవలు
ఫిబ్రవరి 5న ముఖ్య సమావేశం
టెర్మినల్ భవనంలో..
ఓర్వకల్లు, న్యూస్టుడే: ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ఇండిగో ప్రతినిధులు అక్షయ్ సుబ్బరాము, రాహుల్బజాజ్, రాంబాబు మెహతా తదితరులు గురువారం సందర్శించారు. ప్రధానంగా టెర్మినల్ భవనం, రన్వే, ఏటీసీ తదితర వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 5న జరిగే సమావేశంలో ఇక్కడి నుంచి విమానాలను ఎక్కడికి నడపాలనే వివరాలను చెబుతామని అధికారులు పేర్కొన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి ఏఐటీఏ కోడ్ కేజేబీ అని ప్రతిపాదించినట్లు వివరించారు. మార్చిలో విమాన సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, డైరెక్టర్ కైలాస్
మండల్, ఇంజినీరు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
Tags :