Published : 24/01/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్షణకాలంలో దూసుకొచ్చిన మృత్యువు

● మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న టిప్పర్‌

● బావ, బావమరిది దుర్మరణం

 

ప్రమాదానికి ముందు సాయంత్రం 5.35 గంటలకు

మద్దిలేటిస్వామి ఆలయం వద్ద

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : వారిద్దరూ ఆ కుటుంబాలకు ఏకైక వారసులు. తల్లిదండ్రుల ఆశలన్నీ వారిపైనే.. కుమారులు చేతికంది రావడంతో తమ కష్టాలు తీరాయని భావించారు. అనుకోని ప్రమాదంలో వారు ప్రాణాలు కోల్పోవడంతో తల్లడిల్లిపోయారు. ఇక తమకు దిక్కెవరంటూ విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. కర్నూలు మండలం నిడ్జూరు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కురువ శివ(20), కురువ మురళి (27) దుర్మరణం పాలయ్యారు. ఆర్‌.కొంతలపాడుకు చెందిన మురళి, శివ స్వయాన బావ..బావమరుదులు. (మురళి తండ్రి యుగంధర్‌, శివ తల్లి మహేశ్వరి స్వయానా అన్నాచెల్లెలు). వారి తల్లిదండ్రులకు వీరు ఏకైక వారసులు. ఇద్దరూ కలసి బేతంచెర్ల పరిధిలో మద్దిలేటి స్వామిని దర్శించుకుని తిరిగి ద్విచక్ర వాహనంపై కర్నూలు మీదుగా స్వగ్రామానికి వెళ్తున్నారు. నిడ్జూరు సమీపంలో టిప్పర్‌ ఢీకొట్టి కొద్దిదూరం వరకు లాక్కెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాడు తండ్రి.. నేడు కుమారుడు

వ్యవసాయ ఆధారిత కుటుంబమైన యుగంధర్‌, జయమ్మ దంపతులకు కుమారుడు మురళి, కుమార్తె సంతానం. మురళికి భార్య సుజాత, కుమారుడు మధు, కుమార్తె వర్షిత ఉన్నారు. మురళి చిన్నప్పుడే తండ్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు అతను సైతం ఇలా బలయ్యాడు.

వారసుడిని కోల్పోయి..

వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న నగేష్‌, మహేశ్వరి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. శివ కర్నూలులో ఇంటర్‌ పూర్తి చేసి హైదరాబాదులో ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చి ప్రాణాలు కోల్పోయారు.


ఘటనా స్థలంలో మృతదేహాలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని