
చదువుల దీపిక
● నేడు జాతీయ బాలికల దినోత్సవం
ఇంటి ముందు పాఠ్యాంశాలను చదువుతున్న దీపిక
గోనెగండ్ల, న్యూస్టుడే: గోనెగండ్ల ఉప్పర వీధిలో నివాసం ఉంటున్న కృష్ణ, చంద్రకళలది నిరుపేద కుటుంబం. కూలి పనులే జీవనాధారం. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె దీపిక ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఏటా గ్రామంలో పనులు లేని సమయంలో తల్లిదండ్రులు వలస వెళ్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది పిల్లల బాధ్యతను దీపికపై వదిలేసి తల్లిదండ్రులు హైదరాబాదుకు వలస వెళ్లి వచ్చారు. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంటిపట్టున ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూస్తోంది దీపిక. అలాగే తన చదువు ఆపకుండా కొనసాగిస్తోంది. పేదరికంతో ఇబ్బందులు తలెత్తినా బాలిక చదువుల్లో ముందుంటోందని పాఠశాల ఉపాధ్యాయులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Tags :