Published : 24/01/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కత్తి చూపుతూ వైకాపా నాయకుడి బెదిరింపులు

● ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు..

పోలీసులు సీజ్‌ చేసిన ఇసుక ట్రాక్టరు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టరును ఆపిన సెబ్‌ అధికారులకు వైకాపా నాయకుడి నుంచి బెదిరింపులు ఎదురైన సంఘటన శనివారం ఆదోని మండలం దిబ్బనకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. తాలుకా పోలీసుల కథనం ప్రకారం.. ఆస్పరి మండలం బైలుపత్తికొండకు చెందిన వైకాపా నాయకుడు నర్సప్ప జంబన్నవాగు నుంచి ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. దిబ్బనకల్లు సమీపంలోని విద్యుత్తు సబ్‌ స్టేషన్‌ వద్ద జిల్లా సెబ్‌ అధికారులు అతణ్ని అడ్డుకున్నారు. దీంతో నర్సప్ప కత్తితో సెబ్‌ ఏఎస్సై చంద్రమురళితో పాటు నలుగురు పోలీసు సిబ్బందిని బెదిరింపులకు గురి చేశాడు. వారి అతణ్ని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. సెబ్‌ ఏఎస్సై చంద్రమురళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నర్సప్పను అరెస్టు చేసినట్లు ఎస్సై నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. ఇసుక ట్రాక్టరును సీజ్‌ చేశామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని