Published : 24/01/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైటెక్‌ రైల్వేస్టేషన్‌

● పూర్తిగా మారిన రూపురేఖలు ●

మార్చి మొదటి వారానికి పనులు పూర్తి

 

సర్వాంగ సుందరంగా అద్దాల గదులు

కర్నూలు బీక్యాంపు, న్యూస్‌టుడే: కొవిడ్‌ నేపథ్యంలో నిలిచిపోయిన రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనుల్లో ప్రస్తుతం వేగం పెరిగింది. హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో కర్నూలు రైల్వేస్టేషన్‌ను గతంలో ఆదర్శ స్టేషన్‌గా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా రూ.15 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత దీనిని రూ.8 కోట్లకు కుదించారు. ఈ నిధులతో రైల్వేస్టేషన్‌ ముఖద్వారాన్ని పూర్తిగా మార్చేశారు. అధునాతన లైటింగ్‌ సిస్టం ఏర్పాటుచేశారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బుకింగ్‌ కౌంటర్‌ కేంద్రాలు పెంచారు. అతిథుల నిరీక్షణ కోసం అందమైన టెంట్‌, స్టేషన్‌లో ఏసీ గదులు, వెయిటింగ్‌ హాలు, వాహనాల పార్కింగ్‌ కేంద్రాలను తీర్చిదిద్దారు. తుది దశ పనులు మరో రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశముందని రైల్వే అధికారులు ‘న్యూస్‌టుడే’కు వెల్లడించారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్‌ హైటెక్‌ను తలపిస్తోంది. స్టేషన్‌ పరిసర ప్రాంతాలను సైతం పచ్చదనంతో నింపారు. మార్చి 15వ తేదీన దక్షిణ మద్య రైల్వే జీఎం వచ్చే అవకాశం ఉండటంతో పనుల్లో మరింత వేగం పెరిగింది.

స్టేషన్‌ ముందు ఏర్పాటు చేసిన నందనవనం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని