Published : 24/01/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మురుగు తొలగింది.. దారి వెలిగింది

మట్టితో రహదారిని బాగు చేస్తున్న సిబ్బంది

అవుకు, న్యూస్‌టుడే: ‘అడుసు తొక్కకుండా అడుగులో అడుగు’ అన్న శీర్షికన శనివారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రహదారులు-భవనాల శాఖ పర్యవేక్షకుడు దస్తగిరి ఆధ్వర్యంలో శనివారం 40 ట్రాక్టర్ల మట్టి, పాలిషింగ్‌ పరిశ్రమల రాళ్లను తెచ్చి మురుగు ప్రాంతంలో వదిలి డోజర్‌ సాయంతో చదును చేశారు. ఎంతోకాలంగా కొనసాగుతున్న మురుగు సమస్యకు తెరపడటంతో విద్యార్థులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

లాటరీ పద్ధతిలో సీట్ల భర్తీ

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి బాలయోగి గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో మిగిలిన సీట్లను లాటరీ పద్ధతిలో భర్తీ చేయనున్నామని, ఆసక్తి కలిగిన విద్యార్థులు 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమన్వయకర్త ఐ.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. 27వ తేదీన లాటరీ పద్ధతిలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థి తమతోపాటు ఆధార్‌, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాలని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని