Published : 24/01/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైద్యవృత్తిలో రాణించి.. పట్టుదలతో ఐపీఎస్‌ సాధించా

● జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప ●

ఎమ్మిగనూరులో పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు

 

గెలుపొందిన మహిళలకు బహుమతి ప్రదానం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: వైద్య వృత్తిలో రాణించి.. ఐపీస్‌ సాధించాలని, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో చదివి అనుకున్నది సాధించానని ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప అన్నారు. శనివారం శిక్షణ ఎస్పీ పి.ఎస్‌.కిషోర్‌ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాల సాముహిక భోజనం, ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. అంతకు ముందు పట్టణ పోలీసు స్టేషనల్‌లో అమర్చిన సీసీ కెమెరాలు, శుద్ధజల కేంద్రం, పట్టణ పోలీసుస్టేషన్‌ అధునికీకరణ, మొక్కలు నాటే కార్యక్రమం, క్రీడా పోటీలు, బాలికలకు కుర్చీలాటలు, పోలీసుల సామూహిక సమ్మేళనం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పాల్గొన్నారు. ముందుగా పట్టణ ప్రజల కోసం పట్టణ పోలీసు స్టేషన్‌లో నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. మొక్కలు నాటారు. అనంతరం వాలీబాల్‌లో ఎమ్మిగనూరు జట్టుతో పోలీసు జట్టు తలపడగా ఎస్పీ, శిక్షణ ఎస్పీ కలిసి పాల్గొన్నారు. అనంతరం పోలీసుల సమస్యలపై కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం పోలీసు కుటుంబాలతో సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ కరోనా సమయంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకంగా నిలిచిందని, ఎంతోమంది కుటుంబాలను సైతం వదిలిపెట్టి ఉద్యోగం చేసి అభినందనలు పొందారని గుర్తుచేశారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు, ప్రతి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే శక్తి పోలీసుకే ఉందన్నారు. మూడు నెలల్లో శిక్షణ ఐపీస్‌ కిషోర్‌ పట్టణంలో ఎంతో మార్పు తెచ్చారని కొనియాడారు. అదనపు ఎస్పీ గౌతమి శాలి మాట్లాడుతూ పోలీసులు నిత్యం నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. శిక్షణ ఎస్పీ మాట్లాడుతూ మూడు నెలలుపాటు అందరి సహకారంతో మార్పు కోసం ప్రయత్నించినట్లు వివరించారు. ఇక్కడ ప్రజలు, అధికారులు ఎంతో సహకరించారన్నారు. డీఎస్పీ వినోద్‌ కుమార్‌, సీఐలు శ్రీనివాస నాయక్‌, మంజునాథ్‌, ప్రభాకర్‌రెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సమన్వయంతో ఎన్నికల విధులు : ఎస్పీ

ప్రస్తుత స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ చెప్పిన విధంగా నడుచుకుంటామని ఎస్పీ ఫక్కీరప్ప ఈ సందర్భంగా అన్నారు. రెండింటినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామని, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులకు స్పష్టత ఉంటుందన్నారు.

పోలీసు కుటుంబ సభ్యులతో ఎస్పీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని