Published : 24/01/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉపాధ్యాయుడి గైర్హాజరుపై విచారణ

పాఠశాలలో విచారణ చేపట్టిన జిల్లా ఉప విద్యాధికారిణి మీనాక్షి 

గడివేముల, న్యూస్‌టుడే : గడిగరేవుల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడిగా పనిచేసిన సుధాకర్‌పై జిల్లా ఉప విద్యాధికారిణి మీనాక్షి శనివారం విచారణ చేపట్టారు. తొమ్మిదేళ్లుగా పాఠశాలకు సక్రమంగా రాకుండా ఈవోఎల్‌ సెలవులు పెట్టిన సుధాకర్‌కు అధిక పాయింట్లు కేటాయించి బదిలీల్లో లబ్ధి చేకూర్చారంటూ బహుజన ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సతీష్‌ జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉప విద్యాధికారిణి పాఠశాలకు వచ్చి విచారించారు. ఉపాధ్యాయుడు రాని సమయంలో పాఠాలు ఎవరు చెప్పారో అడిగారు. వాలంటీరును ఏర్పాటు చేసి చెప్పినట్లు గుర్తించామని ఉప విద్యాధికారిణి తెలిపారు. ఆయన పనిచేసిన కాలంలో ముగ్గురు హెచ్‌ఎంలు పనిచేశారని, వారు అతనికి ఎలా సహకారం అందించారో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో దస్త్రాలు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని