Published : 27/01/2021 04:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు

ప్రతిఒక్కరూ సిద్ధమవ్వాలి

కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశం

సమావేశంలో పాల్గొన్న అధికారులు 

కర్నూలు నగరం (జడ్పీ): జిల్లాలో నాలుగు దశల్లో నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు అన్నిశాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయాలని కలెక్టరు వీరపాండియన్‌ ఆదేశించారు. ఆయన మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలి దశ నామినేషన్లకు తక్కువ సమయం ఉండటంతో పనులు వేగంగా చేయాలని, ఎక్కడా ఎలాంటి పొరబాట్లు లేకుండా చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లు, వసతులపై నివేదిక అందజేయాలని, జడ్పీ కార్యాలయంలో ఎన్నికల కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్యకు సూచించారు.  అభ్యర్థుల వ్యయం, సెక్టోరల్‌ అధికారుల నియామకం, ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ పెట్టెలు తదితరాలు సమకూర్చుకోవాలని డీపీవోను ఆదేశించారు.

ఎన్నికల అధికారులు వీరే

జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టరు, అదనపు జిల్లా ఎన్నికల అధికారులుగా జేసీలు, డీపీవో, జడ్పీ సీఈవో, డిప్యూటీ ఎన్నికల అధికారులుగా ఆర్డీవోలు. సహాయ ఎన్నికల అధికారులుగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు వ్యవహరించనున్నారు.
28వ తేదీన శిక్షణ: కర్నూలు, నంద్యాల, ఆదోని రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో ఆర్‌వోలు, ఏఆర్‌వోలకు 28వ తేదీన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. శిక్షణ సమన్వయకర్తగా పరిశ్రమలశాఖ డీడీ సోమశేఖరరెడ్డికి కలెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు. అదే రోజు సాయంత్రం నంద్యాల సబ్‌ కలెక్టరు కార్యాలయంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలపై కలెక్టరు, ఎస్పీ తదితరులు సమావేశం నిర్వహిస్తారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని