
రైతుల కోసం పోరాడితే..అక్రమ కేసులా?
మాట్లాడుతున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ
చాగలమర్రి, న్యూస్టుడే: రైతుల సంక్షేమం కోసం తెదేపా నేతలు పోరాటం చేస్తే అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ ఆరోపించారు. చాగలమర్రిలో మాజీ సర్పంచి అన్సర్బాషా సోదరుడు మహబూబ్బాషా ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని మంగళవారం ఆమె పరామర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలపై అక్రమ కేసులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక, పింఛను కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి వచ్చిందని ఆరోపించారు. మాజీ ఎంపీపీ రఘునాథరెడ్డి, మాజీ జడ్పీటీసీ రామసుబ్బయ్య, నాయకులు పాల్గొన్నారు.
Tags :