Published : 27/01/2021 04:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నూర్పిడి యంత్రంలో పడి మహిళ మృతి

చంద్రమ్మ (దాచిన చిత్రం) 

ఆస్పరి, న్యూస్‌టుడే : శనగ నూర్పిడి యంత్రంలో పడి మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నగరూరు గ్రామానికి చెందిన నిరుపేద రైతు నల్లగుట్టయ్య గ్రామంలో భాస్కర్‌రెడ్డికి చెందిన పొలాన్ని కౌలుకు తీసుకుని పప్పుశనగ పంటను సాగు చేశాడు. పంట చేతికి రావడంతో కోత కోసి కుప్పలు వేశారు. శనగల నూర్పిడి యంత్రంతో విత్తనాలు తీసే ప్రయత్నంలో రైతు భార్య చంద్రమ్మ  చీర ఒక్కసారిగా యంత్రంలో చిక్కుకుపోయింది. అప్రమత్తం అయ్యేలోపు క్షణాల్లో ఆమె శరీరం పూర్తిగా యంత్రంలోకి వెళ్లిపోగా.. తల, చెయ్యి తెగిపోయి అక్కడిక్కడే మృతి చెందారు. భర్త కళ్లెదుటే భార్య మృతి చెందడంతో ఆయన రోదించిన తీరు వర్ణనాతీతం. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇందులో ఇద్దరు మగ పిల్లలు 2009 సంవత్సరంలో అనుకోని విధంగా సెల్‌ టవర్‌ వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. కుమార్తె శిరీషా ట్రిపుల్‌ ఐటీ చదువుతోంది. ఆస్పరి ఎస్సై గిరిబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని