Published : 27/01/2021 04:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కర్ణాటక మద్యం రవాణాపై పోలీసుల దాడులు

ఒకరు అరెస్టు.. మరో నలుగురు పరార్‌

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వినోద్‌కుమార్, సీఐలు, ఎస్సైలు 

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆదోని పట్టణ శివారులోని దొడ్డనగేరి బైపాస్‌ రహదారిలోని యల్లమ్మ కొండ సమీపంలో కర్ణాటక మద్యం రవాణాపై ఆదోని పోలీసులు దాడులు చేశారు. పెద్దఎత్తున కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఒకరిని అరెస్టు చేయగా, మరో నలుగురు పరారయ్యారు. ఆయా వివరాలను ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌ వెల్లడించారు. ఆదోని మండలం పెద్దహరివాణానికి చెందిన గర్జప్ప, కర్ణాటక రాష్ట్రం నాడంగ గ్రామానికి చెందిన బి.వెంకటేశు, బసవలింగ, నాగరహాల్‌కు చెందిన మహబూబ్‌బాషా, బి.ఎం.సూగూరుకు చెందిన డ్రైవరు భోజరాజులు కలిసి కర్ణాటక నుంచి మద్యం ప్యాకెట్లతో కారులో ఆదోనికి బయలుదేరారు. కారుకు నెంబరు ప్లేటు లేకపోవడంతో అనుమానం వచ్చి ఒకటో పట్టణ పోలీసులు దాడులు చేపట్టారు. గర్జప్ప, వెంకటేశు, బసవలింగ, మహబూబ్‌బాషా పరారవ్వగా.. కారు డ్రైవరు భోజరాజును అరెస్టు చేశారు. 2880 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని, ఇండిగో కారును సీజ్‌ చేశారు. 
*వీటి విలువ దాదాపు రూ.3 లక్షలు ఉంటుంది. మహబూబ్‌బాషా గతంలోనూ స్కార్పియో వాహనంలో కర్ణాటక మద్యం తరలిస్తుండగా అరెస్టు చేశారు. ఇతనిపై షీట్‌ నమోదు చేశారు. దాడుల్లో ఉత్తమ పనితీరును చూపిన సీఐ చంద్రశేఖర్, ఎస్సైలకు అభినందనలు తెలిపారు. ఎస్సై ప్రహ్లాద, కానిస్టేబుళ్లు బ్రహ్మయ్య, లక్ష్మన్న, అయ్యన్నలకు నగదు పురస్కారం అందించారు. ఈ సమావేశంలో సీఐ నరేష్‌బాబు, ఎస్సైలు రమేష్, రామాంజులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని