
ఆర్టీసీ సిబ్బందికి ప్రోత్సాహకాలు
ప్రోత్సాహక బహుమతి అందిస్తున్న డీఎం
డోన్పట్టణం, న్యూస్టుడే: ఆర్టీసీలో చోదకులు, కండక్టర్లు, మెకానిక్లు సంస్థకు ఖర్చులు తగ్గించి ఆదాయం తీసుకొచ్చే వారికి గుర్తింపు, ప్రోత్సాహకాలు ఉంటాయని డిపో మేనేజర్ నరసింహులు పేర్కొన్నారు. ఖర్చు తగ్గించడం, ఇంధనం ఆదాచేయడంలో కృషి చేసిన కండక్టర్లు సుదర్శన్రావు, ఐవీఆర్ రెడ్డి, చోదకులు శివలింగేశ్వరుడు, ఎస్ఎం బాషా, మెకానిక్లు ఇస్మాయిల్, శ్రీనివాసరావు తదితరులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పుల్లయ్య, జిలానీ పాల్గొన్నారు.
Tags :