Published : 27/01/2021 04:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు

శకునాలలో వసతులను పరిశీలిస్తున్న అధికారులు 

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని శకునాలలో ఎంపీడీవో శివనాగప్రసాద్, ఈవోఆర్డీ శివకుమార్‌ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. 22 పంచాయతీలు, 220 వార్డులకు ఎన్నికలు జరగనున్నట్లు వివరించారు. ఆరు క్లస్టర్లలో నామపత్రాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓర్వకల్లు క్లస్టర్‌లో ఓర్వకల్లు, కన్నమడకల, ఎన్‌.కొంతలపాడు, గుట్టపాడు, నన్నూరు క్లస్టర్‌లో నన్నూరు, పూడిచెర్ల, మీదివేముల, కేతవరం, ఉయ్యాలవాడ క్లస్టర్‌లో ఉయ్యాలవాడ, లొద్దిపల్లె, బైరాపురం, ఉప్పలపాడు, హుసేనాపురం క్లస్టర్‌లో హుసేనాపురం, కాలవ, గుడుంబాయి తండా, శకునాల క్లస్టర్‌లో శకునాల, తిప్పాయిపల్లె, బ్రాహ్మణపల్లె, సోమయాజులపల్లె క్లస్టర్‌లో సోమయాజులపల్లెతో పాటు కొమరోలు, చింతలపల్లె, పాలకొలను అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆయన వెంట ఈవోఆర్డీ శివకుమార్‌ ఉన్నారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని