
ర్యాలీతో స్తంభించిన ట్రాఫిక్
బళ్లారి చౌరస్తా సమీపంలో ఒకవైపు ట్రాక్టర్ల ర్యాలీ..
మరోవైపు నిలిచిపోయిన వాహనాలు
కర్నూలు సాంస్కృతికం, న్యూస్టుడే : వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం రైతు సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో పెద్దఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది దీనికి తరలివచ్చారు. ఫలితంగా ఆర్టీసీ బస్టాండు నుంచి బళ్లారి చౌరస్తా ప్రాంతం వరకు పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనాలు ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు.
Tags :