Published : 28/02/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉల్లికి షామియానా


బాపులదొడ్డిలో ఉల్లికి ఎండ తగలకుండా నీడ కోసం షామియానా కట్టిన రైతు

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: ఎక్కడైనా విందులు, వినోదాలు, వివాహాలకు షామియానా కట్టడం చూశాం. కానీ పెద్దకడబూరు మండలం బాపులదొడ్డిలో ఓ రైతు ఉల్లికి షామియానా కట్టారు. ఎందుకంటారా.. ఉల్లి రైతుకు కష్టమొచ్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లికి కల్లంలో వడదెబ్బ తాకింది. గత నాలుగు రోజుల నుంచి ఎండలు పెరిగాయి. అధిక వేడిమితో సరకు ఆరిపోతే ధర తగ్గుతుంది. ఫలితంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉల్లికి మార్కెట్లో మంచి ధర ఉంది. క్వింటా రూ.3 వేలకు పైగా ఉంది. ఎండ తాకితే ఉల్లి పాడవుతుందని రోజుకి రూ. 800 బాడుగ చెల్లించి షామియానా కట్టి నీడ ఏర్పాటు చేసినట్లు రైతు చిన్న మారెన్న తెలిపారు. ఎకరంలో సుమారు 130 క్వింటాళ్ల దిగుబడి సాధించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని