Published : 28/02/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి


సమీక్ష సమావేశానికి హాజరైన కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో పురపాలక ఎన్నికలను సైతం కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లు ప్రశాంతంగా జరపాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సూచించారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్‌ హాలులో మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై రాయలసీమ, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లతో ఆయన శనివారం సమీక్షించారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ డా.ఫక్కీరప్ప, మున్సిపల్‌ కమిషనర్లు హాజరయ్యారు. ఎన్నికల మేనేజ్‌మెంట్‌ను బాగా చేశారని, చివరి.. నాలుగో విడత పంచాయతీ ఓట్ల లెక్కింపును పకడ్బందీ ప్రణాళికతో రాత్రి 9 గంటలకల్లా పూర్తి చేశారని కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్పను ఎస్‌ఈసీ అభినందించారు. ఎన్నికల వార్‌ రూమ్‌ను ఏర్పాటు చేయడం, వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించడం, ఓట్ల లెక్కింపును త్వరితగతిన పూర్తి చేయడంలో జిల్లా యంత్రాంగం బాగా పనిచేసిందని ప్రశంసించారు. జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లను పీపీటీ ప్రజంటేషన్‌ ద్వారా కలెక్టర్‌, ఎస్పీలు ఎస్‌ఈసీకి వివరించారు. కర్నూలు జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎస్‌ఈసీ సమీక్ష సమావేశానికి జేసీ రాంసుందర్‌రెడ్డి, డీఆర్వో పుల్లయ్య, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, జిల్లా నోడల్‌ అధికారులు, ప్రత్యేక ఉప కలెక్టర్లు, డీఎస్పీలు తదితరులు హాజరయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని