Published : 28/02/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైద్యుల సేవలు మరిచిపోలేనివి

డాక్టర్‌ శ్రీహరి, డాక్టర్‌ నారాయణరావును సన్మానించిన వైద్యులు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : సర్వజన వైద్యశాలలోని జనరల్‌ సర్జరీ విభాగంలో వైద్యులు శ్రీహరి, నారాయణరావు ఎనలేని సేవలందించారని, వారు అందరికీ ఆదర్శనీయులని వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జిక్కి, ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వైద్య కళాశాలలోని న్యూ సీఎల్‌జీలో ఉద్యోగ విరమణ చేస్తున్న జనరల్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీహరి, జనరల్‌ సర్జరీ విభాగం గ్యాస్ట్రో సర్జరీ వైద్యుడు నారాయణరావును సత్కరించారు. వైద్యులు నరసింహులు, మల్లికార్జున్, రంగారెడ్డి, కృష్ణనాయక్,  విజయ్‌శంకర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మహేంద్రకుమార్, జయరామ్, మాధవిశ్యామల తదితరులు పాల్గొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని