Published : 28/02/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శాస్త్రీయ వైఖరిని పెంపొందించాలి

డోన్‌: నమూనాను తిలకిస్తున్న ఉప విద్యాధికారి

డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని, విజ్ఞానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని ఉప విద్యాధికారి నాగరాజు పేర్కొన్నారు. శనివారం పాతపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 28న వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సైన్స్‌పై అవగాహన పెంచుకుని నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు రకాల ప్రయోగ నమూనాలను పరిశీలించారు. విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు వెంకటేశ్వరగౌడ్, రమణ పాల్గొన్నారు. 
ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన: పత్తికొండ పట్టణం, న్యూస్‌టుడే: వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పత్తికొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాన్‌రెడ్డప్ప ప్రారంభించారు. తొలుత సి.వి.రామన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సాధించిన విజయాలను, జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. సైన్స్‌ ఉపాధ్యాయులు జయలక్ష్మి, జాకీర్‌ ఉశేన్‌ల పర్యవేక్షణలో విద్యార్థులు రూపొందించిన నమూనాలను ప్రదర్శించారు.

పత్తికొండ: ప్రదర్శనను తిలకిస్తున్న జాన్‌రెడ్డప్ప


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని