
ఎంపీ ఇల్లు ముట్టడి: 20 మందిపై కేసు నమోదు
ఎంపీతో మాట్లాడుతున్న ఆందోళనకారులు
నంద్యాల పాతపట్టణం, న్యూస్టుడే: నంద్యాల పట్టణంలో 1906 నుంచి నేటి వరకు అనేక సరికొత్త వంగడాలు సృష్టిస్తున్న ఆర్ఏఆర్ఎస్ భూముల్లో వైద్య కళాశాల నిర్మించకూడదంటూ సీఐటీయూ, వ్యవసాయ కార్మిక నాయకులు శనివారం ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఇల్లు ముట్టడికి ప్రయత్నించారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్ నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి ఎంపీ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, గౌస్ మాట్లాడుతూ.. ఎంపీ, ఎమ్మెల్యేలు సానుకూలంగా ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండు చేశారు. అనంతరం ఎంపీ ఇల్లు ముట్టడికి యత్నించిన 20 మంది నాయకులపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేశ్, తోట మద్దులు పాల్గొన్నారు.
Tags :