Published : 28/02/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాతికేళ్ల అనంతరం.. ఆత్మీయ సమ్మేళనం


వేదికపై పాలిటెక్నిక్‌ కళాశాల పూర్వ విద్యార్థులు

ఆదోని, విద్య, న్యూస్‌టుడే: ఒకనాడు తాము చదివిన కళాశాలను, అధ్యాపకులనూ మర్చిపోలేని విద్యార్థులు పాతికేళ్ల తర్వాత అపూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. అందుకు ఆదోని పట్టణంలోని టీజీఎల్‌ పాల్‌టెక్నిక్‌ కళాశాల వేదికైంది. అక్కడ 1991-95లో మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్‌ కమ్యునికేషన్‌లో డిప్లొమో చదివిన విద్యార్థులు పాతికేళ్ల తర్వాత కలిశారు. వేడుకలు నిర్వహించి తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. శ్రీకాళహస్తిలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్న విజయ్‌ అందరి చరవాణుల నంబర్లు అందర్నీ ఒకచోట చేర్చారు. శనివారం నిర్వహించిన సమావేశంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి ప్రిన్సిపల్‌ రాఘవేంద్ర, అధ్యాపకులు బ్రహ్మయ్య, ఖాజాహుసేన్‌, నాగరాజు, శివప్రసాద్‌లను ఘనంగా సన్మానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని