Published : 28/02/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

మాట్లాడుతున్న జేడీ ఉమామహేశ్వరమ్మ

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ అన్నారు. శనివారం బనవాసిఫారంలోని కృషివిజ్ఞాన కేంద్రంలో ఆత్మ సహకారంతో ‘రైతు-శాస్త్రవేత్తల’ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో చౌడు నేలలను బాగు చేసుకునేందుకు రాయితీపై జిప్సం అందచేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన పలు సందేహాలకు శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. కేవీకే సమన్వయకర్త డాక్టర్‌ టి.శ్రీనివాస్, ఆత్మ డీపీడీ శ్రీలత, ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సుజాతమ్మ పాల్గొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని