Published : 28/02/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కడుపు కోత మిగిలింది

నీటి తొట్టిలో పడి 18 నెలల బాలుడి మృతి


మహమ్మద్‌ అఖీల్‌ (పాత చిత్రం)

పాములపాడు (నందికొట్కూరు), న్యూస్‌టుడే : మొదటి కాన్పులో ఆడ శిశువు పుట్టి పురిటిలోనే చనిపోయింది. రెండో కాన్పులో మగ శిశువుకు జన్మనిచ్చింది ఆ తల్లి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న వారి ప్రేమను చూసి ఏదిష్టి తగిలిందో ఏమో... నీటితొట్టి రూపంలో మృత్యువు ఆ చిన్నారిని బలితీసుకుంది. పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన మహమ్మద్‌ రఫీ కుమారుడు మహమ్మద్‌ అఖీల్‌ (18 నెలలు) ఇంటి వద్ద ఆడుకుంటూ నీటితొట్టిలో పడి మృతి చెందాడు. రఫీకి నాలుగు ఏళ్ల కిందట వివాహం అయ్యింది. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టి పురిట్లోనే మృతి చెందింది. రెండో కాన్పులో మగబిడ్డ పుట్టాడు. కుటుంబ సభ్యులు అల్లారుముద్దుగా చూసుకొనేవారు. శనివారం ఆ తల్లి ఇంట్లో పనిలో నిమగ్నం కాగా బాలుడు ఆడుకుంటూ పశువుల పాకవైపు వెళ్లాడు. అక్కడ నీటితో నిండుగా ఉన్న తొట్టిలో చెప్పులు వేసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. తల్లి పిల్లవాడి కోసం చుట్టూ గాలించినా కనిపించలేదు. చివరకు నీటితొట్టిలో విగత జీవుడిగా కనిపించాడు. ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని