Published : 28/02/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎస్సీ, ఎస్టీ కేసులో ఇద్దరి అరెస్టు

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: మండలంలోని పెద్దకొప్పెర్ల గ్రామానికి చెందిన ఇద్దరిని ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టు చేసినట్లు రేవనూరు ఎస్సై సత్యనారాయణ శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన తెదేపా వర్గీయుడు మునగాల సుదర్శన్‌రెడ్డి నుంచి ఓబులం శివదస్తగిరి రూ.40 వేలు అప్పు తీసుకున్నాడు. ఈయన వైకాపా వర్గీయుల తరపున వార్డు సభ్యునిగా పోటీ చేయడంతో సుదర్శన్‌రెడ్డి, మరికొంతమంది ఈ నెల 11న అతని వద్దకు వెళ్లి మా వద్ద అప్పు తీసుకొని మాకే వ్యతిరేకంగా పోటీకి నిలబడతావా అంటూ కులం పేరుతో దూషించి బెదిరించాడన్నారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఆరుగురిపై కేసు నమోదు చేసి నిందితులు సుదర్శన్‌రెడ్డితోపాటు చెదుల్లా రామిరెడ్డిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మిగిలినవారిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.    


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని