Published : 28/02/2021 16:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బ్యాలెట్‌ బాక్సులను పరిశీలించిన కలెక్టర్‌

ఆదోని మార్కెట్‌: ఆదోని పురపాలక ఎన్నికల కోసం బ్యాలెట్‌ బాక్సుల ఎంపిక పనులను పురపాలక కమిషనర్‌ ఆర్జీవీ కృష్ణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొత్తం 42 వార్డులకు 175 చిన్న, 175 పెద్ద బ్యాలెట్‌ బాక్సులు కావాలని ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. వాటికి అనుగుణంగా నిల్వ ఉంచిన బ్యాలెట్‌ బాక్సులను వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణపై ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకులతో చర్చించినట్లు తెలిపారు. అత్యంత గోప్యంగా బ్యాలెట్‌ బయటికి రాకుండా ముద్రణ పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 1.64 లక్షల మంది ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ మధుసుధన్‌ రెడ్డి, మేనేజర్ భాస్కర్‌ రెడ్డి, పట్టణ ప్రణాళిక అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని