Published : 28/02/2021 21:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండు వార్డుల్లో నామపత్రాల దాఖలు

ఆదోని మార్కెట్‌: ఆదోని పుర ఎన్నికల్లో 40, 41 వార్డుల్లో ఇద్దరు వైకాపా అభ్యర్థులు ఆదివారం నామపత్రాలు దాఖలు చేశారు. గతంలో ఇక్కడ నామినేషన్‌ చేసిన ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబీకులు తిరిగి మళ్లీ నామినేషన్లు వేశారు. 40వ వార్డులో నజీర్‌ అహ్మద్‌ మృతి చెందగా ఆయన కోడలు సలీమ భాను, 41 వార్డులో వృద్ధురాలు పార్వతీ మరణించడంతో ఆమె మనవరాలు హిందూ నామినేషన్‌ వేశారు. కాగా, రిటర్నింగ్‌ అధికారులు పత్రాలు సేకరించి పరిశీలన చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని