Published : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అవిశ్రాంత బోధకుడు.. రాజశేఖరుడు

వెల్దుర్తి, న్యూస్‌టుడే: పదవీ విరమణ పొందిన అనంతరం ఉద్యోగులు ఇంటికే పరిమితం అవుతారు. వెల్దుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజశేఖర్‌గౌడ్‌ మార్చి 31న పదవీ విరమణ పొందారు. కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులకు సిలబస్‌ పూర్తికాలేదు. పదవీ విరమణ పొందినా ఈయన మాత్రం విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విధులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. కరోనా నేపథ్యంలోనూ విద్యార్థుల కోసం కర్నూలు నుంచి నిత్యం పాఠశాలకు వస్తూ వారి ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నారు. పేద బాలికల కోసం గణితం సంబంధించిన పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నారు. రాజశేఖర్‌గౌడ్‌ చేస్తున్న సేవలకు పలువురు అభినందిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని