Published : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూల రాముడికి అభిషేకం


మూల రాముడిని చూపుతున్న పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు

 

మంత్రాలయం, న్యూస్‌టుడే: రాఘవేంద్ర మఠంలో మూల రాముడికి మహాభిషేకం కనుల పండువగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం మూలరాముల పూజా మండపంలో పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు మూల రాముడు, దిగ్విజయరాములు, జయరాములు, సంతానగోపాల కృష్ణ, వైకుంఠ వాసు దేవతా మూర్తులను కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం క్షీర, పంచామృతాభిషేకం నిర్వహించారు. గంధలేపనం అనంతరం ఆభరణాలు, పూల దండలతో అలంకరించి వివిధ రకాల హారతులిచ్చారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి మంగళహారతులిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని