Published : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిడుగు పడి మూగజీవాల మృత్యువాత


మేక పిల్లలను పరిశీలిస్తున్న పశువైద్య సిబ్బంది

 

అవుకు, న్యూస్‌టుడే: పిడుగుపాటుకు శింగనపల్లె సమీపంలో 47 మేకలు, గొర్రెలు మృతి చెందగా, అవుకులో కోటవీధికి చెందిన సుభద్రకు చెందిన బర్రె మృత్యువాత పడింది. కొలిమిగుండ్ల మండలం గొర్రిమానిపల్లె, నాయునిపల్లెలకు చెందిన గొర్రెల కాపర్లు మేత కోసం మందలను తెచ్చుకొని శింగనపల్లె సమీపంలోని పొలాల్లో ఉంచారు. ఉదయం రెండు గంటల ప్రాంతంలో పిడుగు పడటంతో మేక పిల్లలు అక్కడికక్కడే మృతిచెందాయి. గొర్రెలు, మేకలను గుండ్లశింగవరం, కొలిమిగుండ్ల పశువైద్యాధికారులు ఐశ్వర్య, పద్మావతి, సహాయకుడు రాజేష్‌ పరిశీలించారు. గొర్రెలు, మేకల పెంకందారుల సంఘం జిల్లా డైరెక్టర్‌ జయరాముడు యాదవ్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మృతిచెందిన వాటి విలువ రూ.2.40 లక్షలుగా అంచనా వేశారు. బాధితులకు పశునేస్తం ద్వారా సాయమందించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని