Updated : 11/06/2021 05:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నైపుణ్య విద్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన

వివరాలు తెలుసుకుంటున్న జేసీ రామసుందర్‌రెడ్డి

డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే: యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పనలో భాగంగా డోన్‌లో కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో నిర్మించేందుకు పాలకులు, అధికారులు నిర్ణయించారు. గురువారం జేసీ రామసుందర్‌రెడ్డి ఇతర అధికారులు కళాశాల స్థలాన్ని పరిశీలించారు. కళాశాల నిర్మాణం కోసం గుర్తించిన 4.74 ఎకరాల స్థలాన్ని, నమూనాను తహసీల్దారు నరేంద్రనాథ్‌రెడ్డి, పురపాలక ఛైర్మన్‌ సప్తశైల రాజేష్‌, కమిషనర్‌ కె.ఎల్‌.ఎన్‌.రెడ్డి, సర్వేయర్‌ శ్రీనివాసులు జేసీకి చూపించారు. రెవెన్యూ కాలనీలో ఆయుర్వేద ఆసుపత్రి పక్కనున్న భవనాలను కూల్చివేసి, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని నిర్మించే ప్రాంతంలో 21 సెంట్ల స్థలానికి సంబంధించిన మ్యాపును జేసీ పరిశీలించి స్థానిక అధికారులతో చర్చించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని