AP News: నేతల అంత్యక్రియల్లో పాల్గొన్న లోకేశ్‌ 
logo
Updated : 18/06/2021 14:09 IST

AP News: నేతల అంత్యక్రియల్లో పాల్గొన్న లోకేశ్‌ 

గడివేముల: కర్నూలు జిల్లాలో దారుణహత్యకు గురైన తెదేపా నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి కుటుంబాలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పరామర్శించారు. గడివేముల మండలం పెసరవాయిలో బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను కోల్పోయామని..  బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని లోకేశ్‌ హామీ ఇచ్చారు. అనంతరం మృతిచెందిన నేతల అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు.


 

ఇటీవల మృతిచెందిన తమ చిన్నాన్న కుమారుడు మోహన్‌రెడ్డి చిన్న కర్మ నేపథ్యంలో నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి గురువారం ఉదయం శ్మశానానికి కాలినడక బయల్దేరి వెళ్లారు. వారు శ్మశానికి సమీపంలోకి రాగానే అక్కడే అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్థులు పక్కా ప్రణాళిక ప్రకారం కారుతో ఢీకొట్టి.. ఆపై వేట కొడవళ్లు, గొడ్డళ్లతో నరికి వారిని దారుణంగా హత్య చేశారు. కారుతో ఢీకొట్టడంతో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని