సీఐపై చర్యలకు ఎస్పీ హామీ
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

సీఐపై చర్యలకు ఎస్పీ హామీ

ఎస్పీతో విద్యుత్తు శాఖ ఎస్‌ఈ, ఐకాస నాయకులు

కర్నూలు నేరవిభాగం, శిరువెళ్ల, న్యూస్‌టుడే: కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి, కర్నూలు మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీ వెంకట్రామయ్య, ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర, సీఐలు చంద్రబాబునాయుడు, విక్రమ్‌సింహాతో కలిసి విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డి, ఐకాస నాయకులు గణేష్‌, రవీంద్ర, బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి రామరాజు, కృష్ణయ్య, శివకుమార్‌ ఆదివారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఐకాస నాయకులు మాట్లాడుతూ ఇక మీదట ఇరువురు పరస్పరం గౌరవభావంతో కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. డీఎస్పీస్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని ఎస్పీ చెప్పారని, నివేదిక వచ్చిన తర్వాత సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఎస్పీ హామీతో సంతృప్తి చెందామని, చర్చలు సఫలమయ్యాయని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని