స్ఫూర్తి కేంద్రానికి మరింత ప్రాచుర్యం కల్పిస్తాం
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

స్ఫూర్తి కేంద్రానికి మరింత ప్రాచుర్యం కల్పిస్తాం

పాల్గొన్న ఎంపీ టీజీ వెంకటేష్‌ తదితరులు

కర్నూలు బీక్యాంపు, న్యూస్‌టుడే: శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అసవరం ఉందని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ పేర్కొన్నారు. స్థానిక పరిణయ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం మరింత ప్రాచుర్యం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నాగేశ్వరరావు, కార్యదర్శి రాఘురామయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని