స్వల్పంగా పెరిగిన టమాటా ధరలు
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

స్వల్పంగా పెరిగిన టమాటా ధరలు

విక్రయం కోసం ఉంచిన టమాటాలు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే : పత్తికొండ టమాటా మార్కెట్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన వేలాల్లో ధరలు ఆశాజనకంగా పలికాయి. గత వారం పది రోజులుగా టమోటా కిలో రూ.4 నుంచి రూ.5 పలికిన ధరలు ఒక్కసారిగా రూ.8 నుంచి రూ.15 వరకు చేరింది. దీంతో అన్నదాతలకు కాస్త ఊరట లభించింది. ఇదే ధరలు మరి కొన్ని రోజులపాటు లభిస్తే కనీసం పెట్టుబడి ఖర్చులైనా దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆదివారం ఒక్కరోజే 250 టన్నులకుపైగా సరకు రావటంతో మార్కెట్‌ ప్రాంతమంతా టమాటా గంపలు, రైతులతో కిక్కిరిసిపోయింది. సరకు అమ్మిన రైతులు డబ్బుల కోసం సరకు కొనుగోలు చేసిన వ్యాపారుల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ మార్కెట్లలో టమాటా ధరలు కాస్త పెరిగాయని, ఈ నేపథ్యంలో రైతుల నుంచి అధిక మొత్తానికి కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని