ప్రైవేటీకరణ బిల్లు ఉపసంహరించుకోవాలి
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

ప్రైవేటీకరణ బిల్లు ఉపసంహరించుకోవాలి

సమావేశంలో మాట్లాడుతున్న సంఘం నేత రామలింగారెడ్డి

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: విద్యుత్తు సంస్థ ప్రైవేటీకరణ బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ఎలక్ట్రిసిటి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.రామలింగారెడ్డి, పొన్నశివయ్యలు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ.. ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు మార్పు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యుత్తు ఉద్యోగులపై భౌతికంగా దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని