మేలురకం విత్తనాల ఎంపికే కీలకం
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

మేలురకం విత్తనాల ఎంపికే కీలకం

మాట్లాడుతున్న డాట్‌ సెంటర్‌ ప్రధాన శాస్త్రవేత్త డా.సుజాతమ్మ

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: వాతావరణ పరిస్థితులు, బెట్టను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నూతన వంగడాలను ఎంపిక చేసుకోవడమే కీలకమని డాట్‌ సెంటర్‌ ప్రధాన శాస్త్రవేత్త డా.సుజాతమ్మ పేర్కొన్నారు. రాబోయే రబీ సీజన్‌లో సాగుచేసే శనగలో మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకొని సాగు చేస్తే అధిక దిగుబడులు ఆర్జించవచ్చన్నారు. ఆత్మ ఆధ్వర్యంలో ఆదివారం బహుళార్థ పశువైద్యశాలలో దేశీ కార్యక్రమం కింద ఇన్‌పుట్‌ డీలర్లకు ఆదివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పంటలకు కొంత మేర నష్టం జరిగిందని, పంటలను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులను ఆమె వివరించారు. శిక్షణలో 40 మంది ఇన్‌పుట్‌ డీలర్లు, ఫెసిలిటేటర్లు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని